Startup IPO’s | ప్రస్తుతం మార్కెట్లో ఐపీవోల సందడి నెలకొంది. ఈ ఏడాది ఓ 12 స్టార్టప్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలుగా చేరనున్నాయి. ఇప్పటికే మూడు స్టార్టప్‌లు స్టాక్ మార్కెట్ల నుంచి ఐపీవో ద్వారా నిధులు సేకరించగా, మరో మూడు ఆ బాటలో ఉన్నాయి. నవంబర్ 10 లోపు లిస్టెడ్ కంపెనీలు కానున్నాయి. ఇప్పటికే రెండు స్టార్టప్ సంస్థలు ఐపీవోకు వెళ్లేందుకు అనుమతించాలని సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. సెబీ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నాయి. ఇక మరో రెండు త్వరలో సెబీకి దరఖాస్తు చేసుకోనున్నాయి. ప్రస్తుతం మూడు స్టార్టప్‌లు ఐపీవో లిస్ట్‌లో ఉన్నాయి.
ఇప్పటికే ఈజీట్రిప్ ప్లానర్స్ విలువ రూ.5204 కోట్లు కాగా, రూ.510 కోట్ల నిధులు సేకరించింది. ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో విలువలో అతి పెద్దది. దీని మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లు. స్టాక్‌మార్కెట్లలో లిస్టింగ్‌తో రూ.9,375 కోట్లు సమకూర్చుకున్నది. ఐపీవోకు వెళ్లిన తొలి స్టార్టప్ ఇదే. థర్డ్ లిస్టెడ్ స్టార్టప్ కార్‌ట్రేడ్. దీని విలువ రూ.5,573 కోట్లు. విలువలో చాలా చిన్న సంస్థ ఇది. ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో చేరిన కార్ ట్రేడ్ రూ.2,999 కోట్లు సేకరించింది.
ఇప్పుడు నాలుగో స్టార్టప్ న్యాకా లిస్టింగ్ కోసం సిద్ధమైంది. ఐపీవో గడువు సోమవారం ముగియనున్నది. లిస్టింగ్ ద్వారా రూ.5,352 కోట్ల నిధులు సేకరించనున్నది. దీని విలువ రూ.53,200 కోట్లు. మరోవైపు పాలసీబజార్ ఐపీవో సోమవారం ప్రారంభమై బుధవారం ముగియనున్నది. రూ.46,125 కోట్ల విలువ గల పాలసీ బజార్ రూ.5,625 కోట్లు సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.
స్టార్టప్ సంస్థల్లో అధిక విలువ గల సంస్థ డిజిటల్ ఫైనాన్సియల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం. ఈ సంస్థ ఐపీవో నవంబర్ 8-10 మధ్య మార్కెట్లోకి రానున్నది. పేటీఎం విలువ రూ.1.48 లక్షల కోట్లు. మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్-35 కంపెనీల్లో ఇది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ద్వారా రూ.18,300 కోట్ల నిధుల సేకరణ పేటీఎం లక్ష్యం. అందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.10,000 కోట్లు, న్యూ షేర్ల విడుదల ద్వారా రూ.8,300 కోట్లు సేకరించనున్నది.
ఇక రూ.1,900 కోట్ల నిధులను సేకరించడానికి మొబిక్విక్ దాఖలు చేసిన ఐపీవో దరఖాస్తుకు సెబీ ఆమోదం తెలిపింది. మొబిక్విక్ విలువ రూ.7,500 కోట్లు. వచ్చేనెలలో మార్కెట్లను తాకనున్నది. మరోవైపు హోటల్ బుకింగ్ అండ్ ట్రావెల్ ఫెసిలిటీ స్టార్టప్ ఓయో కూడా అప్రూవల్ కోసం సెబీకి అప్లయ్ చేసుకుంది. పేటీఎం, జొమాటో తర్వాత మార్కెట్ వాల్యుయేషన్‌లో ఓయో మూడో స్థానంలో నిలుస్తుంది. ఓయో విలువ రూ.90 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఐపీవో ద్వారా రూ.8,430 కోట్లు సేకరించనున్నది.
రూ.5,600 కోట్ల విలువ గల ఇక్సిగో రూ.1,600 కోట్ల నిధుల సేకరణకు అనుమతించాలని సెబీకి దరఖాస్తు చేసేందుకు సిద్ధం అవుతున్నది. ఇంకా డిల్లీవరీ, ఫామ్ ఈజీ వంటి స్టార్టప్ సంస్థలు ఐపీవో కోసం సెబీ వద్ద ఫైలింగ్ కోసం ప్రిపేరవుతున్నది. రూ.34 వేల కోట్ల విలువ గల డిల్లీవరీ రూ.7,500 కోట్లు, రూ.45 వేల కోట్ల వాల్యూ గల ఫామ్ఈజీ రూ.3,500 కోట్లు సేకరణకు సిద్ధం అయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరీంనగర్‌లోని ఈ గుట్టల వల్లే తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చిందా?
Mystery | ఈ ఊళ్లో ఒకరు పోతే.. వారంలో ఇంకొకరు చావాల్సిందే.. వందల ఏళ్లుగా ఇదే సీన్
కొండల్లో దారి తప్పిన వ్యక్తి.. ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తలేదు.. కారణం ఏం చెప్పాడంటే
116 ఏండ్లు గడిచినా చెక్కుచెదరని గడీ.. ఓ రైతు కట్టుకున్న ఇంద్ర భవనం ఎక్కడుందో తెలుసా?
33 ఏండ్లు మారుమూల దీవిలో ఏకాంతవాసం.. ఇప్పుడు నగరంలో కొత్త జీవితం..!
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే