Pre Wedding Diet | పెండ్లికూతురు.. నవ్వితే ముత్యాలు రాలాలి. నడిస్తే నెమలి చిన్నబోవాలి. ఇక, కళ్లెత్తితే చాలు కనకాభిషేకాలే! ‘ప్రీ వెడ్డింగ్ డైట్’తో వధువు అందం మరింత ఇనుమడిస్తుందని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.
♦ రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. చక్కెర లేకుండా నిమ్మరసం తీసుకోవాలి. నీటిశాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయల రసాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు.
♦ సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ కలిగిన గోధుమ, రాగి, ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ పాస్తా వంటివి తినాలి. వీటితోపాటుగా ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం, చిక్కుళ్లు, శనగలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
♦ అవకాడో, నట్స్, బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారంతో చర్మానికి, జుట్టుకు సరైన పోషణ అందుతుంది.
♦ క్యారెట్, దోసకాయ, కీరదోస, టమాట పచ్చిగా తీసుకోవచ్చు. దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఫ్రీరాడికల్స్ నుంచి రక్షణ లభిస్తుంది.
♦ బీట్రూట్, టమాట, స్ట్రాబెరీ, దానిమ్మ, నానబెట్టిన బాదం గింజలు చర్మానికి కొత్త కాంతిని ఇస్తాయి.
♦ పెండ్లికి ముందు వైట్షుగర్, వైట్‌రైస్ ఎక్కువగా తీసుకోకూడదు.
♦ కేక్స్, బిస్కెట్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
♦ ముఖ్యంగా నిద్రకు భంగం కలిగించే కాఫీ, టీలు వద్దేవద్దు. సరైన సమయానికి సరైన నిద్ర మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మధ్యాహ్నం కొద్దిసేపు కునుకు తీయవచ్చు.
నిన్నటి దాకా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్.. ఇప్పుడేమో నయా ట్రెండ్.. అసలేంటిది?”
Customized Bridal Ware | పెండ్లిళ్లలో ఇదిప్పుడు నయా ట్రెండ్.. ఇంతకీ ఏంటి ఈ ఫ్యాషన్ !!
పెండ్లిల్లో వధూవరులను ఏడడుగులు ఎందుకు వేయమంటారు? ఒక్కో అడుగు అర్థమేంటి?
ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!
నిన్నటి దాకా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్.. ఇప్పుడేమో నయా ట్రెండ్.. అసలేంటిది?