గురువారం 13 ఆగస్టు 2020
Beauty-tips - Jul 22, 2020 , 22:41:53

హెయిర్ కండీష‌న‌ర్‌తో తెలియ‌ని ఉప‌యోగాలివే..!

హెయిర్ కండీష‌న‌ర్‌తో తెలియ‌ని ఉప‌యోగాలివే..!

జుట్టు నిగ‌నిగ‌లాడాల‌ని మంచి షాంపూతో పాటు కండీష‌న‌ర్ కూడా వాడాతుంటారు మ‌హిళ‌లు. మ‌రి ఆ కండీష‌న‌ర్ ఇంకా చాలా మంచి ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఊహించారా. ఆ ప‌నులేంటో తెలిస్తే అవాక్క‌వుతారు. 

* జుట్టుకు వాడే కండీష‌న‌ర్‌ను శ‌రీరానికి కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. అది బాడీ స్క్ర‌బ్‌గా ప‌నిచేస్తుంది. దీనివ‌ల్ల శ‌రీరానికి స‌హ‌జ సిద్ద‌మైన తేమ‌ను అందిస్తుంది.  

* హెయిర్ కండీష‌న‌ర్ వాడిన‌ప్పుడు జుట్టు సువాస‌న వెద‌జ‌ల్లుతుంది. ఆ సువాస‌న న‌చ్చిన‌ట్ల‌యితే కంఫ‌ర్ట్ మాదిరిగానే ఉతికిన బ‌ట్ట‌ల‌ను ఈ మిశ్రంలో ముంచి ఆర‌పెట్టుకోవ‌చ్చు. లేదంటే కండీష‌న‌ర్‌కి స్ప్రే బాటిల్‌లో నింపి ఉతికిన బ‌ట్ట‌ల‌పై స్ప్రే చేసుకున్నా స‌రిపోతుంది. 

* కండిషనర్‌లను షేవింగ్ క్రీమ్‌గా కూడా ఉపయోగించవచ్చు. షేవింగ్ టైమ్ లో స్కిన్ హైడ్రేట్‌గా ఉండాలి. కాబట్టి కండీషనర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

* చేతులు, పాదాలు అందంగా ఉండాలంటే.. కాట‌న్ బాల్‌ను ఉప‌యోగించి కండీష‌న‌ర్‌ను గోళ్ల‌పై ఉప‌యోగిస్తే స‌రిపోతుంది. ఇది పెడిక్యూర్, మ్యానిక్యూర్‌గా ప‌నిచేస్తుంది. 

* మీ షవర్ డ్రెయిన్‌కి ఏవైనా అడ్డుపడితే అందులో కొంచెం కండీషనర్ పోయాలి. దీనివ‌ల్ల పేరుకున్న చెత్త అంతా క్లియ‌ర్ అవుతుంది.  అదనంగా కొంచెం వేడి నీటిని పోయడం ద్వారా, సమస్య పరిష్కారమవుతుంది.

* ముఖానికి వేసుకున్న మేక‌‌ప్‌ను తొలిగించేందుకు కూడా హెయిర్ కండీష‌న‌ర్‌ను వాడొచ్చు. 

* అంతేకాకుండా గాయాల‌కు అంటిచ్చిన స్టిక్క‌ర్లు, బ్యాండేజ్‌లు రాని స‌మ‌యంలో హెయిర్ కండీష‌న‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.logo