Sun Tan | ఎండల దెబ్బకు చర్మం కమిలిపోయి నల్లగా మారుతుంది. మచ్చలు ఏర్పడతాయి. దీన్నే ‘సన్ ట్యాన్’ అని వ్యవహరిస్తారు. కాబట్టి, బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. దీనితోపాటు ప్రత్యేకమైన ఆహారమూ తీసుకోవాలి.
♦ విటమిన్-సి సమృద్ధంగా ఉండే నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ, కివీ తరచూ తీసుకోవాలి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
♦ దానిమ్మ చర్మాన్ని లోపలినుంచీ రక్షిస్తుంది. ఆ గింజల్లోని ఎలాజిక్ యాసిడ్, ఆంథోసయానిన్స్, టానిన్స్ ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తాయి. ఎండవల్ల కమిలిన చర్మానికి కొత్త నిగారింపు తెస్తాయి.
♦ పుచ్చకాయలో నీటి శాతం అధికం. దీనివల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. సన్ ట్యాన్ రాకుండా అడ్డుకుంటుంది కూడా. ఇందులోని లైకోపీన్, విటమిన్-సి చర్మాన్ని చల్లబరుస్తాయి.
♦ క్యాలీఫ్లవర్ చర్మాన్ని సన్‌ట్యాన్ నుంచి రక్షిస్తుంది. ఇందులోని హిస్టిడిన్ అతినీల లోహిత కిరణాలను గ్రహించి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో పోరాడుతుంది.
♦ కెరోటిన్, లైకోపీన్, విటమిన్-సి పుష్కలంగా ఉండే క్యారెట్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తూనే, సన్ ట్యాన్‌ను తగ్గిస్తాయి. వివిధ గింజలు, విత్తనాలు కూడా చర్మ సమస్యల నుంచి కాపాడతాయి.
ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!”
ఎలా పడితే అలా స్నానం చేయొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే”
“పుట్టగొడుగులు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయని తెలుసా!!”
“Dark Circles | కంటి కింద వలయాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి”
అందంగా కనబడాలని ఏ క్రీమ్ పడితే అది వాడుతున్నారా.. ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోండి”
“Beauty Tips | అందమైన పెదవుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి”