Oppo K14 Lite : ఒప్పో బ్రాండ్ నుంచి కే14 లైట్ పేరుతో తాజాగా 4జీ ఫోన్ విడుదలైంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కే14 5జీ ఫోన్‌కు ఇది లైట్ వెర్షన్. అయితే, ఇది 4జీ ఫోన్ మాత్రమే. బేసిక్ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. ధర రూ.16,999. కొన్ని కార్డులపై డిస్కౌంట్లు ఉన్నాయి. ఫీథర్ పర్పుల్, స్టోన్ బ్రౌన్ కలర్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే సేల్కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.75 అంగుళాల హెచ్డీ+ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, యునిసాక్ టీ7250 ఆక్టాకోర్ ప్రాసెసర్, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్, 13 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4జీబీ+64జీబీ, డెడికేటెడ్ స్లాట్ ఫర్ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్16, ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, ఏఐ ఫీచర్లు, గ్లోవ్ టచ్, ఫ్లాష్ టచ్, ఆయిలీ హ్యాండ్ సపోర్టెడ్ స్క్రీన్ వంటి ఫీచర్లున్నాయి.