Mushrooms | సంప్రదాయ చైనా వైద్యంలో పుట్టగొడుగుల్ని బాగా వాడేవారు. పుట్టగొడుగుల్లో పోషకాలు అపారం. యాంటీ ఆక్సిడెంట్లు, వాపులు తగ్గించే గుణాలూ ఎక్కువే. ఇదో గొప్ప సౌందర్య సాధనమనీ నిర్ధారణ అయ్యింది. దీంతో అనేక ఉత్పత్తులు వెల్లువెత్తుతున్నాయి.
♥ పుట్టగొడుగులోని ‘ట్రెమెల్లా’ అనే పదార్థం నుంచి తీసిన నూనె.. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. వృద్ధాప్య లక్షణాలను హరిస్తుంది.
♥ పుట్టగొడుగుల లేపనం రాయడం వల్ల పొడిబారిన చర్మం తేమగా ఉంటుంది.
♥ పుట్టగొడుగుల పొడిని ఫేషియల్ మాస్క్‌గా ఉపయోగిస్తారు. ఇది జిడ్డును తొలగిస్తుంది. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మలినాలను వదలగొడుతుంది.
♥ పుట్టగొడుగుల నుంచి తీసిన ప్రొటీన్‌తో హెయిర్ కండిషనర్ తయారు చేస్తారు. ఇది కుదుళ్లను శుభ్రం చేస్తుంది.
♥ పుట్టగొడుగుల నుంచి తయారు చేసే మాయిశ్చరైజర్ కళ్లకింద వచ్చే ఐ బ్యాగ్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది.
“అందంగా కనబడాలని ఏ క్రీమ్ పడితే అది వాడుతున్నారా.. ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోండి”
పాదాలు అందంగా కనిపించాలా? అయితే గ్రీన్ టీతో ఇలా చేసి చూడండి”
Beauty Tips | అందమైన పెదవుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి”
Dark circles | కళ్ల కింద చారాలా? ఇలా చేయండి ఫలితం మీరే చూడండి”