శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 04, 2020 , 00:34:44

ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అందేలా చూడాలి

ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అందేలా చూడాలి

భద్రాచలం, నమస్తే తెలంగాణ: గిరిజన ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకున్న గిరిజనులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ ఏపీవో జనరల్‌ కే.నాగోరావు అన్నారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన ప్రజావాణి దర్భార్‌లో ఏపీవో పాల్గొని గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....తన పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. బోరు, కరెంట్‌, కనెక్షన్‌, పోడు భూముల పట్టాల కొరకు, ఆర్ధిక సహాయం కోసం తదితర వాటిపై ప్రజలు దరఖాస్తులు పెట్టుకున్నట్లు ఏపీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో భీమ్‌, అడిషినల్‌ డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ వీ.వెంకటేశ్వర్లు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ ఈఈ రాములు, ఎస్‌వో సురేష్‌బాబు, జీసీసీ డీఎం కుంజా వాణి, ఏడీ అగ్రికల్చర్‌ సుజాత, ఏపీవో పవర్‌ అనురాధ, జేడీఎం హరికృష్ణ, యూనిట్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.