అమరావతి : ఒడిశా తీరాన్ని అనుకుని వాయవ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రేపు(బుధవారం) ఏపీలో విస్తారంగా వర్షాలు (Rains) పడుతాయని ఏపీ వాతావరణ (Meteorological Department) కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉపరితం ఆవర్తనం, రుతుపవప ద్రోణి కూడా నెలకొని ఉందని స్పష్టంచేసింది.
వాయువ్య, పశ్చిమ ంధ్య బంగాళాఖాతంలో జులై 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడతాయని, తీరం వెంబడి 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
ప్రకాశం, విజయనగరం, కోనసీమ, పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు కృష్ణా, అనకాపల్లి, తిరుపతి, నెల్లూరు. బాపట్ల, గుంటూరు. శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతాయని అధికారులు వెల్లడించారు. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని , మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.