ఇస్లామాబాద్: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలో చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోని పలు మిలిటరీ కేంద్రాలపై పాకిస్థాన్ వైమానిక దాడలు చేసింది. టెర్రరిస్టు గ్రూపులపై చేసిన దాడుల్లో సుమారు 331 మంది ఆఫ్ఘన్ తాలిబన్ సిబ్బంది మృతిచెందినట్లు పాకిస్థాన్ అధికారులు చెప్పారు. మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్(Operation Ghazab lil-Haq) కొనసాగుతున్నట్లు పాకిస్థాన్ పేర్కొన్నది. పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా త్రారర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అర్థరాత్రి వరకు సుమారు 331 మంది ఆఫ్ఘన్ తాలిబన్ సిబ్బంది హతమయ్యారని, మరో 500 మంది ఆఫ్ఘన్ సిబ్బంది గాయపడినట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 104 పోస్టులను ధ్వంసం చేశామన్నారు. ఆపరేషన్ ఘజబ్ లిల్హక్లో భాగంగా 22 పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్పారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 163 ట్యాంక్‌లు, ఆయుధ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆఫ్ఘన్ బోర్డర్లో ఉన్న 29 లొకేషన్లను వైమానిక దళం టార్గెట్ చేసినట్లు మంత్రి తెలిపారు.