అమరావతి : ఏపీలో వైసీపీ శ్రేణులు, ప్రజలపై జరుగుతున్న దాడులపై హైకోర్టు(High Court), సుప్రీం కోర్టుల (Supreme Court) కు వెళతామని, రాష్ట్రంలో ఎందుకు రాష్ట్రపతి పాలన (President rule ) విధించకూడదో కోర్టులను అడుగుతామని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పేర్కొన్నారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను మంగళవారం విజయవాడ ఆస్పత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యారని ఆరోపించారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ (Governor) జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఏపీలో దాడులు, కిరాతాలకు పాల్పడి ఏం సాధిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి సమయం పడుతుందని, కాని కూటమి ప్రభుత్వానికి కొద్ది సమయంలో వ్యతిరేకత ఫాస్ట్‌గా ప్రారంభమయిందని ఆరోపించారు.
కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవాలని చంద్రబాబు(Chandra Babu) గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి భయాందోళనలు నెలకొని ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని తామూ అధికారంలోకి వస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొనసాగుతున్న దాడులను జాతీయ స్థాయికి తీసుకెళ్లి వివరించామని తెలిపారు. దాడులతో ప్రజలు ఎవరూ కూడా భయపడరని, ఇది కోపంగా మారి ప్రభుత్వాన్ని, పార్టీని బంగాళాఖాతంలోకి కలిపే పరిస్థితులు వస్తాయన్నారు. చదువులను, వైద్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
Minister Nimmala | ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు బుద్ధి చెప్పినా, మార్పు రావడం లేదు : మంత్రి నిమ్మల
డబ్బులతో ఓట్లు కొనాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.. బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు