అమరావతి : ఏపీలో ప్రతిపక్షనేతగా కూడా ఉండడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కు అర్హత లేదని ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చినా కానీ ఇప్పటికి పద్ధతిలో మార్పు రావడం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) విమర్శించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఆఫ్ఘానిస్తాన్, అమెరికాను బెదిరించినట్లు ప్రభుత్వాన్ని జగన్, వైసీపీ(YCP) నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఐదేండ్ల జగన్ పాలనలో నీటిపారుదల రంగాన్ని (Irrgation) పట్టించుకోలేదని విమర్శించారు. కాలువల్లో పూడికతీతను, మరమ్మతు పనులను చేపట్టలేదని ఆరోపించారు. ఐదేళ్లలో ఇరిగేషన్ అధికారులు తమ పనులే మర్చిపోయిన పరిస్థితి ఉందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రిజర్వాయర్లు(Reserviors) అన్నీ జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. రాయల సీమకు తాగు, సాగు నీరు పుష్కలంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీశైలం (Srisailam), నాగార్జునసాగర్, ప్రకాశం(Prakasham Barrage) బ్యారేజ్ వద్ద జలకళ సంతరించుకుందని, వరద నీరు సముద్రంలోకి వెళ్లకుండా ట్యాంక్లు నింపు కోవాలని సూచించారు. నిర్లక్ష్యంతో పనిచేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్యం ప్రకారం అధికారులు పని చేయాలని వెల్లడించారు.
పరామర్శల పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు జగన్కు లేదని అన్నారు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యంలను ఎలా చంపారో అందరికీ తెలుసునని చెప్పారు. ప్రభుత్వం వద్ద అభివృద్ధికి సరిపడనంతా నిధులు లేకపోయినా ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేయాలని అధికారులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు.