అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ (IPS Transfer ) అధికారులు బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. సత్య ఏసుబాబు(Satya Yesu Baabu) డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. గ్రేహూండ్స్ గ్రూప్ కమాండర్‌గా గరుడ్ సుమిత్ సునీల్‌ను, ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా కేవీ మురళీకృష్ణను, పార్వతీపురం ఎస్డీపీవోగా అంకిత మహవీర్ నియమించారు.
విజయవాడ డీసీపీ(Vijayawada DCP) గా కేఎం మహేశ్వర్ రాజు, గ్రేహూండ్స్ గ్రూప్ కమాండర్‌గా సునీల్ షరాన్, గుంతకల్లు ఎస్ఆర్పీగా రాహుల్ మీనా (రైల్వే పోలీసు), ఇంటెలీజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూర్ ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా(Pankaj Kumar Meena) , అనంతపురం ఎస్పీగా పి. జగదీశ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read more :
Tragedy | విషాదం.. వాగులో గల్లంతైన ఉపాధ్యాయురాలు.. వార్డెన్ సురక్షితం
Special Trains | ఈ వీకెండ్లో వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 ప్రత్యేక రైళ్లు