Special Trains | ఈ వీకెండ్లో వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల మధ్య 8 ప్రత్యేక రైళ్లు
Special Trains | ఈ వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
Special Trains : ఈ వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. నర్సాపుర్-సికింద్రాబాద్, కాకినాడ పట్టణం-సికింద్రాబాద్, కాచిగూడ-తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను ఏర్పాటు చేసింది.
నర్సాపురం-సికింద్రాబాద్ (07175) రైలు ఆగస్టు 18న (ఆదివారం) నర్సాపుర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే సికింద్రాబాద్-నర్సాపుర్ (07176) రైలు ఆగస్టు 19న (సోమవారం) సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నర్సాపుర్ చేరుకోనుంది. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07177) రైలు ఆగస్టు 17, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది.
అలాగే ఈనెల 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరనున్న సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07178) రైలు ఆగస్టు 19, 21 తేదీల్లో ఉదయాన్నే 6.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకోనుంది. కాచిగూడ-తిరుపతి (07455) రైలు ఆగస్టు 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి ఆగస్టు 17న (శనివారం) ఉదయం 10.25 గంటలకు తిరుపతి చేరుకోనుంది. అలాగే తిరుపతి- కాచిగూడ (07456) రైలు ఆగస్టు 17న తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9.30గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కాచిగూడ టౌన్-సికింద్రాబాద్ రైలు ఆగస్టు 18న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. ఇకపోతే 07188 నంబర్ కలిగిన రైలు సికింద్రాబాద్‌లో ఆగస్టు 19న రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

