అమరావతి : ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు(Teacher) వాగులో కొట్టుకుపోయింది. మరొకరు చెట్టు కొమ్మ సహాయంతో ప్రాణాలు కాపాడుకున్న ఘటన సాలూరు మండలం పరాయివలస ఒట్టిగెడ్డ వాగులో చోటు చేసుకుంది.
గ్రామంలో ఏకలవ్య పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆర్తి , హాస్టల్ వార్డెన్ (Warden ) మహేశ్ బైక్‌పై వాగు దాటుతుండగా ప్రవాహానికి ఇద్దరు కొట్టుకు పోయారు. ప్రవాహంలో కొంతదూరం వెళ్లిన తరువాత మహేశ్ చెట్టు కొమ్మ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా టీచర్ ఆర్తి వాగులో గల్లంతయ్యారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు వాగులో గాలించిన ఫలితం కనిపించ లేదు. ఘటనపై జిల్లా మంత్రి సంధ్యారాణి స్పందించి ఉపాధ్యాయురాలి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.