(Swachh Sarwekshan Awards) చిత్తూరు: తిరుపతి పట్టణానికి స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. పరిశుభ్రత పాటించే పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో క్లీన్ సిటీ సిటిజన్ చార్ట్ కింద జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. ఈ విషయాన్ని మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటూ ఎంతో మంది యాత్రీకులకు ఆతిథ్యం ఇస్తున్న తిరుపతి పట్టణానికి స్వచ్చ్ అవార్డులు దక్కడం విశేషం.
తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్లో తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డితో కలిసి మంత్రి బొత్సా మీడియాతో మాట్లాడారు. తిరుపతి పట్టణానికి స్వచ్ఛ సర్వేక్షణలో క్లీన్ సిటీ సిటిజెన్ చార్ట్ కింద జాతీయ స్థాయి అవార్డులు దక్కడంలో తిరుపతి ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ సమిష్టి కృషి ఉన్నదని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, విద్య, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి.. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరును క్లాప్ కార్యక్రమం ద్వారా క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..