Botsa on TDP : మావోయిస్టు పార్టీ మాదిరిగా టీడీపీ : మంత్రి బొత్స కామెంట్లు
Bosta on TDP : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మావోయిస్టు పార్టీ మాదిరిగా మారిందని, ఈ రెండింటి మధ్య తేడా లేదని ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని...

(Botsa on TDP) విజయనగరం : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మావోయిస్టు పార్టీ మాదిరిగా మారిందని, ఈ రెండింటి మధ్య తేడా లేదని ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ విమర్శించారు. తెలుగుదేశం పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. టీడీపీ 36 గంటల దీక్ష చేపట్టిన నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి భాష వాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా తాము రాజకీయాల్లో ఉన్నామని, తామెప్పుడూ అలాంటి భాషను మాట్లాడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ వ్యాఖ్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమాధానం ఏంటని బొత్స ప్రశ్నించారు. బీజేపీతో ఉన్నానంటూ చంద్రబాబు పార్ట్నర్ పవన్ సమర్ధన సిగ్గుచేటని, చంద్రబాబుకు సోము వీర్రాజు వత్తాసు పలకడంలో ఆంతర్యమేంటో స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తగవని, చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు తెలపాలని బొత్స డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కారణంగా రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలుగుతున్నదని, టీడీపీని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామన్నారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్లో పెట్టుబడులకు దుబాయ్ సిద్ధం
ఎంతటి రసికుడవో తెలిసెరా.. బిల్ గేట్స్ రహస్యాలు బట్టబయలు
ఇండోనేషియాలో తగ్గనున్న ఆజాన్ సౌండ్
విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
భారత్‌పై దాడులు ప్రారంభించిన చైనా
ఫీజు కట్టలేకపోతున్నారా.. మేం సమకూరుస్తాం.. తెలుగు యూనివర్సిటీ బంపర్ ఆఫర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

