(Ghosts @ Jewellery Shop) రాజమండ్రి: నగల దుకాణం సీసీ టీవీ ఫుటేజీలో తెల్లటి వింత ఆకారాలు రికార్డయి హడలెత్తించాయి. ఈ వార్త రాజమండ్రిలో కలకలం రేపుతున్నది. రెండు వింత ఆకారాలను దయ్యాలేనంటూ వాదించుకోవడంతో.. స్థానికులు భయపడిపోతున్నారు. వివరాల్లోకెళితే..
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి గుండువారి వీధిలో ఉన్న ఓ నగల దుకాణం సీసీటీవీ ఫుటేజీలో రెండు తెల్లటి వింత ఆకారాలు కనిపించాయి. ఈ వార్త ఆనోటా, ఈనోటా రాజమండ్రి అంతటా దావానంలా వ్యాపించింది. దాంతో నగల దుకాణంలో దయ్యాలు రాత్రి వేళ వస్తున్నాయంటూ పుకార్లు షికార్లు చేస్తుండటంతో.. నగల దుకాణం పరిసర ప్రాంతాల వారు హడలిపోతున్నారు. దుకాణం నుంచి వింత అరుపులు, కేకలు కూడా వినిపిస్తున్నాయంటూ మరికొందరు వాదనలను జత చేయడంతో దెయ్యాల షాపింగ్ కాస్తా వైరల్గా మారింది. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన తెల్లటి వింత ఆకారం కదులుతుండటంతో.. దయ్యాలు చేతులు కదుల్చుతున్నాయని, మాట్లాడుకుంటున్నాయని కట్టుకథలు బయటకొచ్చాయి. కావాలని ఎవరో చిలిపిగా ఈ పని చేసి ఉంటారని కొందరు కొట్టిపారేస్తున్నారు. సదరు నగల దుకాణం యజమానిపై కక్షతో ఇలాంటి కట్టుకథలు సృష్టిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..