తిరుమల : తిరుమల(Tirumala) లో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని (Pushkarini) నెలరోజుల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. టీటీడీ(TTD) వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు(Civil Works) చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని వెల్లడించారు.
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడం జరుగుతుందన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను చేపట్టి పూర్తి చేస్తామన్నారు.
పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగించడం. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేయడం , చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారని తెలిపారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారని వివరించారు.
AP High Court | ప్రతిపక్ష హోదా కోసం జగన్ పిటిషన్.. స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
AP News | అమరావతి అభివృద్ధికి ఇచ్చిన 15 వేల కోట్లు అప్పు మాత్రమే.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు