AP High Court | అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌ను విచారణను ఏపీ హైకోర్టు మూడు రోజుల పాటు వాయిదా వేసింది. జగన్ వేసిన పిటిషన్‌పై మంగళవారం ఉదయం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కక్షపూరితంగానే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని వైఎస్ జగన్ తరఫున న్యాయవాది తన వాదనను వినిపించారు.
ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీంతో గత నెల 24వ తేదీనే రిప్రజెంటేషన్ ఇచ్చారని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
శాసనసభలో తమను ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని ఇటీవల స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతతో ప్రమాణస్వీకారం చేయించడం ఆనవాయితీ అని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వొద్దని ముందే నిర్ణయించారా అని లేఖలో ప్రశ్నించారు. ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని తెలిపారు. కానీ స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత వారం జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదని, తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్ వేశారు. ప్రతిపక్ష హోదా విషయంలో స్పీకర్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని, ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందునే ఇలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు.