(Srisailam Bramhostavalu) కర్నూలు: సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైలం దేవస్థానం ముస్తాబైంది. వారం రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జనవరి 12న మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమై జనవరి 18న ముగుస్తాయి. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సాంప్రదాయం ప్రకారం- మకర సంక్రాంతి రోజున, మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు.
జనవరి 12న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 13న బృంగి వాహన సేవ, 14న రావణ వాహన సేవ, 15న నంది వాహన సేవ, బ్రహ్మోత్సవ కల్యాణం, 16న కైలాస వాహన సేవ, పుష్ప పల్లకీ సేవ, 17న పూర్ణాహుతి, త్రిశూల స్నానం, సదస్యం, నాగావళి, ద్వజావరోహణం కార్యక్రమాలు ఉంటాయి. ముగింపు రోజు జనవరి 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల తొలిరోజు ఉదయం 9.15 గంటలకు మల్లికార్జున స్వామి యాగశాల ప్రవేశం చేయనున్నారు. సంకల్పం అనంతరం గణపతి పూజ నిర్వహిస్తారు. అనంతరం కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండ దీపారాధన, వాస్తుపూజ, వాస్తు హోమం, మండప ఆరాధన, కలస్తాపన, పంచవారచన, జపానుస్తం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటలకు ద్వజారోహణం, ద్వజపత ఆవిష్కరణలు ఉంటాయి. ఆ తర్వాత అంకుఅర్పణ, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 14న ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగి పండ్ల కార్యక్రమం నిర్వహించనున్నారు.
యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..