(Genome Sequencing lab) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటైంది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఆవరణలో ఈ ల్యాబ్‌ను నెలకొల్పారు. ఈ ల్యాబ్ ఏర్పాటుతో ఇకపై ఒమిక్రాన్ కేసుల నిర్ధారణ పూర్తిగా ఇక్కడే జరుగనున్నది. సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ దేశంలోనే ఇది రెండోది కావడం విశేషం. మొదటి ల్యాబ్ కేరళలో ఏర్పాటుచేశారు. ఒమిక్రాన్‌తో పాటు ఇతర వేరియంట్లను కూడా ఈ ల్యాబ్‌లో నిర్ధారించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.
ఇప్పటివరకు సేకరించిన శాంపిళ్లను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు నిర్ధారణ నిమిత్తం అధికారులు పంపిస్తున్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుతో ఇప్పుడిక స్థానికంగానే నిర్ధారించుకోవచ్చు. కేవలం మూడు రోజుల్లోనే వేరియంట్ నిర్ధారణ చేపట్టవచ్చునని అధికారులు చెప్తున్నారు. ఫలితంగా రోగులను వెంటవెంటనే గుర్తించి ఐసొలేట్ చేయడం, చికిత్స అందించడానికి వీలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఈ ల్యాబ్ పని చేయనున్నది. ఈ ల్యాబ్‌కు హైదరాబాద్‌లోని సీసీఎంబీ, సీఎస్ఐఆర్లు సహకారమందించనున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు పొంచి ఉండటంతో పాటు వివిధ దేశాల నుంచి ఏపీకి వస్తున్న పలువురు కొవిడ్ పాజిటివ్‌గా తేలుతున్నారు. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపుతున్నారు. దాంతో ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతున్నది. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం విజయవాడలో సంపూర్ణ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది.
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
రిలాక్స్ కోసం కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి
ప్రతినెలా రూ.1500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 35 లక్షలు…
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..