Coffee | రిలాక్స్ కోసం కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి

Coffee | గృహిణుల జీవితంలో కాఫీ ఓ భాగం. భర్తను ఆఫీసుకు పంపాక ఒకసారి, పిల్లల్ని బడిలో దిగబెట్టి వచ్చాక ఒకసారి, ఇష్టమైన సీరియల్ చూస్తూ ఒకసారి, పుట్టింటివాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ ఒకసారి.. రోజుకు ఐదారుసార్లు లాగించేస్తుంటారు. రోజుకు రెండుమూడు కప్పుల కాఫీ ఏమంత ప్రమాదకరం కాదు కానీ, ఆరు కప్పులకు మించి అదే పనిగా తాగేవారిని మాత్రం సమస్యలు చుట్టుముట్టక తప్పదు. అందులోనూ ‘డిమెన్షియా’ (మతిమరుపు వ్యాధి) ముప్పు కాచుకుని ఉంటుంది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా – సెంటర్ ఫర్ ప్రెసిషన్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
అలాగే మెదడు పరిమాణం తగ్గడం లేదా స్ట్రోక్ వంటి సమస్యలు కూడా రావచ్చని చెబుతున్నారు. ‘కాఫీలోని కెఫిన్ ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. మెదడులో రక్త సరఫరాను తగ్గిస్తుంది. ముఖ్యంగా ‘మెమరీ సర్క్యూట్స్’ ఉండే చోటే ఇదంతా జరుగుతుంది. ఫలితంగా ‘న్యూరో డీజెనరేషన్’ సమస్య వస్తుంది. ఇలా దీర్ఘకాలంపాటు పీపాలకు పీపాలు కాఫీ తాగుతుంటే మతిమరుపు, ఆలోచనా లోపం మొదలైన సమస్యలు చుట్టు ముట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కాబట్టి, కాఫీ అలవాటు ఉన్నవాళ్లు రోజుకు రెండుమూడు కప్పులకు పరిమితం కావడమే మేలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒకప్పుడు బొగ్గుతోనే పళ్లు తోమేవారు.. ఇప్పుడు అదే బొగ్గుతో కాఫీ, ఐస్‌క్రీంలు తయారీ.. ఎందుకు?
Coffee Face pack for Healthy Skin | చర్మసౌందర్యానికి కాఫీ ఫేస్‌ప్యాక్
Weight loss with Barley Porridge | బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇది ట్రై చేసి చూడండి
బ్లాక్ కాఫీ.. గుండెకు మంచిదేనా?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

