బార్లీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి, పొద్దున్నే కాఫీ టీలకు బదులుగా బార్లీ గంజి పుచ్చుకోవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణను చైతన్యపరుస్తుంది, బరువు తగ్గాలని అనుకునేవారికి ఉపయోగకరం. రాత్రి పడుకునే ముందు తాగితే నిద్ర బాగా పడుతుంది. కడుపులో మంటను వదలగొడుతుంది. జలుబును దూరం చేస్తుంది. విసర్జన ప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది. గర్భిణులకు మరీ మంచిది. చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతుంది.