Coffee Face pack for Healthy Skin | చర్మసౌందర్యానికి కాఫీ ఫేస్‌ప్యాక్

ఉదయాన్నే కప్పు కాఫీ లభిస్తేకానీ, ఆత్మారాముడికి కిక్కు లభించదు. ఇంకో రెండుగంటలకు మరో కప్పు, సాయంత్రమయ్యేసరికి ఇంకో కప్పు, అనుకోని అతిథి విచ్చేస్తే అదనపు కప్పు.. ఇలా రోజంతా కాఫీరాగాల్లో తేలిపోతుంటారు. కాఫీ తాగడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుందని సర్వేల్లో తేలింది. అందుకే కాబోలు, సౌందర్య ఉత్పత్తుల్లో కాఫీ, కెఫిన్ పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. రుచితో జిహ్వను కట్టిపడేసే కాఫీ బ్యూటీప్యాక్గానూ అద్భుతాలు చేస్తుంది.
- చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది కాఫీ పొడి. ఒక టీ స్పూన్ కాఫీ పొడిలో అర టీ స్పూన్ చక్కెర గానీ, ఉప్పు గానీ వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పూసి మర్దనా చేయాలి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.
- రాత్రి ఉద్యోగాలు చేసి, ఉదయం నిద్రపోయే వాళ్లు ఎదుర్కొనే ముఖ్య సమస్య ‘పఫ్ఫీనెస్’ (ముఖం వాచినట్టుగా కావడం). దీనికి పరిష్కారంగా కాఫీ ఉపయోగపడుతుంది. కాఫీ పొడి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే పఫ్ఫీనెస్ తగ్గుతుంది. కాఫీకి బిగుతుగా ఉంచే లక్షణం ఉండటంతో, చర్మం సాధారణ స్థితికి వస్తుంది.
- కాఫీ పొడి, తేనె మిశ్రమం ముఖానికి పూసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది. కాఫీ పొడిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి, ముఖంపై మొటిమలను కూడా కాఫీ ప్యాక్‌లు పోగొడతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

