(Water labour strike) అనంతపురం: తమకు న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం అనంతపురంలోని మూడు తాగునీటి సంస్థలు కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు 330 మంది కార్మికులు సమ్మెకు దిగారు. అనంతపురంలోని గ్రామీణ తాగునీటి కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా ఏడు నియోజకవర్గాల్లోని దాదాపు 1800 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
అనంతపురం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి, సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. అయితే, వీటిలో పనిచేస్తున్న కార్మికులకు జీతం బకాయి పడ్డారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దాంతో విధిలేని పరిస్థితుల్లో అధికారులకు సమ్మె నోటిసు ఇచ్చి కార్మికులు ఇవాల్టి నుంచి సమ్మెకు దిగారు. దాదాపు 330 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. వీరి సమ్మె కారణంగా ఏడు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 1800 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దాంతో ఇవాళ ఉదయం నుంచి ఈ గ్రామల ప్రజలు నీటి సరఫరా లేక అల్లాడుతున్నారు.
పెండింగ్లో ఉన్న జీతం బకాయిలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. దాంతో ఇంకా ఎన్నిరోజులు తాగునీటికి ఇబ్బంది పడాలో అని ఈ గ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. ఇదే సమస్యపై గత ఏడాది జూలైలో కూడా 16 రోజులపాటు సమ్మె చేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడు బకాయిలు చెల్లిస్తామని ఇచ్చినప్పటికీ పెడచెవిన పెట్టారు.
పోలీసులను పెట్టి పనులు చేయించాలని అధికారులు భావిస్తుండగా.. అదే శ్రద్ధ కార్మికుల బాగోలుపై, బకాయిల చెల్లింపులపై పెట్టాలని కార్మికులు కోరుతున్నారు. పీఎఫ్ చెల్లింపుల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. 2019 నవంబర్ నెల జీతాలు ఇంతవరకు ఇవ్వలేదని, ఇలాంటి తరుణంలో ఎలా కుటుంబాలను నెట్టుకురావాలని వారు ప్రశ్నించారు. అలాగే, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సర్వీసు ప్రయోజనాలు ఇవ్వడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ మూడు సంస్థల ద్వారా జరిగే నీటి సరఫరాకు ఎలాంటి బడ్జెట్ లేకపోవడం వల్ల బకాయిలు చెల్లించలేకపోతున్నామని, రేపటి వరకల్లా సమస్యను పరిష్కరించేలా చూస్తామని అధికారులు చెప్తున్నారు.
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
రిలాక్స్ కోసం కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి
ప్రతినెలా రూ.1500 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 35 లక్షలు…
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..