(Road Accident) రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సూర్యారావుపేట ఎస్ఐ భార్య అక్కడికక్కడే చనిపోగా.. గాయాలతో ఎస్ఐ బయటపడ్డాడు. అన్నవరం పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
విజయవాడ పరిధిలోని సూర్యారావుపేట సీసీఎస్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న కోడూరు సత్యనారాయణ కుటుంబం అన్నవరం పుణ్యక్షేత్రానికి కారులో బయల్దేరింది. అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఎస్ సత్యానారాయణ భార్య సరోజ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, ఎస్ఐ సత్యనారాయణకు ముప్పు తప్పింది. ఆయనతో పాటు గాయపడిన ఇతర కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం గండేపల్లి మండలం మల్లేపల్లి దగ్గర చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్‌ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..