చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
Today History : అంతరిక్ష పరిశోధనల్లో మనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాం. భారతదేశం చేపట్టిన చంద్రయాన్-1 విజయవంతమై 2008 లో సరిగ్గా ఇదే రోజున...

(Today History) : అంతరిక్ష పరిశోధనల్లో మనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నాం. భారతదేశం చేపట్టిన చంద్రయాన్-1 విజయవంతమై 2008 లో సరిగ్గా ఇదే రోజున మన అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలంపై దిగింది. దీని ద్వారా అంతరిక్ష పరిశోధనలో భారతదేశ ఆధిపత్యం పెరిగింది. చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపై కాలిడిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అంతకు ముందు అమెరికా, రష్యా, జపాన్ దేశాలు మాత్రమే ఈ పనిని సాధించగలిగాయి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తన అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన 45 సంవత్సరాల తర్వాత మిషన్ మూన్ చేపట్టింది. 2008 అక్టోబరు 22న చంద్రయాన్-1 ప్రారంభమై.. 2009 ఆగస్టు 30 వరకు చంద్రుని కక్ష్యలో ఉన్నది. ఈ మిషన్‌లో ప్రత్యేకంగా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) పరికరాన్ని పంపగా.. అది చంద్రుడి ఉపరితలంపై నీటిని కనుగొన్నది. ఇది చాలా పెద్ద ఆవిష్కరణ అని, తొలి ప్రయత్నంలోనే ఈ ఆవిష్కరణ చేపట్టడం పట్ల అమెరికన్ స్పేస్ సైన్స్ ఆర్గనైజేషన్ (నాసా) భారతదేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తింది.
చంద్రయాన్-1 ఇస్రో మూన్ మిషన్ మొదటి వాహనం. చంద్రుడిని చేరుకోవడానికి 5 రోజులు.. చంద్రుడి చుట్టూ తిరగడానికి 15 రోజుల సమయం పట్టింది. ఈ ఎంఐపీని భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం రూపొందించారు. భారతీయ శాస్త్రవేత్తలు చంద్రుడి ఒక భాగంపై ముద్ర వేయాలని అబ్దుల్ కలాం గట్టిగా కోరుకున్నారు. అందుకు తగినట్లుగానే ఇస్రోలోని భారతీయ శాస్త్రవేత్తలు నిర్విరామ కృషి సలిపి చంద్రయాన్-1 ను విజయవంతం చేశారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి
ఇవాళ జాతీయ బాలల దినోత్సవం
ఇవాళ ప్రపంచ మధుమేహ అవగాహన దినం
2008: ముంబైపై దాడి కోసం పడవను హైజాక్ చేసిన ఉగ్రవాదులు
1973: సామాన్యుడైన మార్క్ ఫిలిప్స్‌ను వివాహమాడిన క్వీన్ ఎలిజబెత్ కుమార్తె ప్రిన్సెస్ ఆన్
1969: ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి చేర్చిన అపోలో-12 ప్రారంభం
1964: జాతీయ బాలల దినోత్సవాన్ని నవంబర్ 14 జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయం
1955: ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభం
1922: బ్రిటన్‌లో రేడియో సేవలను ప్రారంభించిన బీబీసీ
1889: భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్‌లో జననం
1681: బెంగాల్ ప్రత్యేక రాచరిక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఈస్టిండియా కంపెనీ
ఇవి కూడా చదవండి..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

