(Ramateertham) విజయనగరం: జిల్లాలోని రామతీర్థం కోదండ రామాలయం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది విగ్రహాల ధ్వంసం వివాదం అనంతరం ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ సమస్యను ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజు లేవనెత్తడంతో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. సంప్రదాయాన్ని పాటించడం లేదంటూ అధికారులపై మండిపడ్డారు. ఉత్కంఠత మధ్యే శంకుస్థాపన పూర్తిచేశారు.
ఈ ఆలయాన్ని దాదాపు రూ.3 కోట్లతో నిర్మిస్తున్నారు. ఆరు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి రాతి నిర్మాణంతో ఆలయాన్ని కడుతున్నారు. ధ్వజస్తంభం, వంటశాల, మెట్ల ఆధునీకరణతోపాటు కోనేరును కూడా అభివృద్ధి చేయనున్నారు. గతేడాది డిసెంబరు 28న శ్రీరాముడి విగ్రహం కూల్చివేత నేపథ్యంలో ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని పునరుద్ధరణ పనులను చేపట్టింది. ఇప్పటికే ప్రధాన ఆలయ ప్రాంగణంలో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు జరుపుతున్నారు.
ఇలాఉండగా, రామతీర్థం ఆలయ పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన సందర్భంగా ప్రొటోకాల్ బోర్డుపై ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ గజపతిరాజు పేరు కనిపించలేదు. దాంతో తనకు ధర్మకర్తగా అవమానం జరిగిందని అశోక్ మండిపడ్డారు. అశోక్ కొబ్బరికాయ కొట్టనీయకుండా మంత్రి అడ్డుకున్నారు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అశోక్.. బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. అక్కడున్న వైసీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలసటకు గురైన అశోక్ అనారోగ్యం పాలవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..