హైదరాబాద్ : టోక్యో ఒలింపియన్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం దుర్గమ్మ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఒలింపిక్స్‌లో సాధించిన పతకాన్ని సీఎంకు సింధు చూపించారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధును సీఎం అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సింధును జగన్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ. 30 లక్షల చెక్కును అందించారు.
అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ..క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని చెప్పారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని, త్వరలోనే ఏర్పాట్లు పూర్తిచేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ధోనీ ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ టిక్ తొలగింపు..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్‌పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్‌కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్