అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లా పెద్ద వడుగూరులో ఐదు రోజులుగా వరిగడ్డి వాములకు నిప్పు పెడుతున్న దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఐదు రోజులుగా గ్రామంలోని గడ్డివాములు తగిలబడి పోతుండటంతో బాధితులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గడ్డి వాముల వద్ద డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఓ దుండగుడు గడ్డివాముకు నిప్పుపెట్టి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Drone Attacks | అమెరికా యుద్ధనౌకలపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్
Bheemaram | సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నాయకుడిపై దాడి : వీడియో
Triple Ride: ఒకరి చేతిలో గన్.. ట్రిపుల్ రైడింగ్.. ప్రమాదంలో ముగ్గురు మృతి.. వీడియో