భోపాల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. థ్రిల్ కోసం చేసిన బైక్ రైడింగ్(Triple Ride) వారిని బలితీసుకున్నది. ఈ ఘటన మొత్తం సెల్ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యింది. కొన్ని సెకన్లు ఉన్న ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో ఏప్రిల్ 14వ తేదీన జరిగింది. హై స్పీడ్లో జరిగిన యాక్సిడెంట్ ముగ్గురి ప్రాణాలు తీసుకున్నది. ముగ్గరు సోదరులు ఒక బైక్పై వెళ్తున్న దృశ్యాలను.. మరో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు షూట్ చేశారు.
హైవేపై స్టంట్ చేస్తున్న సమయంలో.. ముగ్గురితో ఉన్న బైకర్ ఓవర్టేక్ చేస్తూ అదుపు తప్పాడు. ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి వద్ద గన్ ఉన్నది. అతను గన్తో సంకేతాలు చేశాడు. అయితే ఓవర్టేక్ సమయంలో అనుకోకుండా ముందు ఓ లారీ కనిపించింది. ఇటుకలతో వెళ్లున్న ఆ లారీని ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న బైక్ ఢీకొన్నది. ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. ముగ్గురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందినట్లు తెలిసింది.
రెండో బైక్ నడుపుతున్న వ్యక్తులు.. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని వీడియో తీశారు. రెండో బైక్పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. థ్రిల్ కోసం అన్నాదమ్ములు ప్రమాదకర స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోవడం శోచనీయం.
मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa
— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026