న్యూఢిల్లీ, జూలై 26 : విద్యార్థుల అణచివేతకు పాల్పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించిన చలో పార్లమెంట్లో విద్యార్థులపై చర్యలకు హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఆదేశాలు ఇవ్వగలరని ఆరోపించారు.
గురువారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనపై బలప్రయోగానికి ఇచ్చిన ఆదేశాలకు అమిత్ షాయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను బెదిరించడం ప్రభుత్వం మానుకోవాలన్నారు.