సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్‌ను ఒకసారి పంపిణీ చేస్తామని జిల్లా రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపారు. జిల్లాలోని 8,43,607 ఆహార భద్రత కార్డుదారులకు ప్రభుత్వం 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం 7,279.513 మెట్రిక్ టన్నుల గోధుమలు కేటాయించామన్నారు. బియ్యం పూర్తి ఉచితంగా గోధుమలు కిలోకు రూ.7 చొప్పున జిల్లాలోని 653 చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామన్నారు.
లబ్ధిదారులు పోర్టబిలిటీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తమకు అనుకూలమైన ఏ చౌకధరల దుకాణం నుంచైనా రేషన్ పొందవచ్చని తెలిపారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు తమ మూడు నెలల రేషన్‌ను పొందవచ్చని చివరి రోజుల్లో రద్దీని నివారించేందుకు త్వరగా రేషన్ తీసుకోవాలని సూచించారు. ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించామని వెల్లడించారు.