(Secretary Arrest) విశాఖపట్నం: జనన ధృవీకరణ పత్రం కోసం వచ్చిన ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కార్యదర్శిని ఇవాళ విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి పాగోటి విశ్వేశ్వరరావు మంగళవారం రూ.2వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సర్వకోట మండలం పరిధిలోని రామకృష్ణాపురం పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి ఉద్యోగావకాశం నిమిత్తం జనన ధ్రువీకరణ పత్రం కోసం నవంబర్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్డీఓ నుంచి ధృవీకరణ పత్రం రావడం ఆలస్యమైంది. ఈ నెల 6న ఆర్డీఓ నుంచి తీసుకొచ్చిన పంచాయతీ కార్యదర్శి విశ్వేశ్వర్రావు.. దానిని బాధితురాలికి ఇచ్చేందుకు రూ.2వేలు లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సర్టిఫికేట్ కోసం సారవకోట మండల కార్యాలయానికి రావాలని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధితురాలు అక్కడికి వెళ్లింది. ఆమె నుంచి రూ.2వేలు లంచం తీసుకుంటుండగా విశ్వేశ్వర్రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శి గత 8 ఏండ్లుగా పనిచేస్తున్నారని, అతనిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..