కడప : (Murder) చిన్నమ్మతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడిని మందలించినా మారలేదు. సరికదా తన బుద్ధులు చెప్పినవారిపైనే తిరగబడ్డాడు. వారితో కలియబడ్డాడు. చివరకు వారి చేతిలో చనిపోయాడు. ఈ ఘటన కడప పట్టణంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కడపలోని అశోక్‌నగర్‌కు చెందిన మహబూబ్ బాషా వృత్తిరీత్యా పెయింటర్. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల మహబూబ్ బాషా తన చిన్నమ్మతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం చిన్నాన్నకు తెలియడంతో మందలించాడు. అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. అదేరీతిగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. కోపోద్రిక్తులైన బంధువులు మహబూబ్ బాషాపైకి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాషా మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..