(New MLCs) విజయవాడ: శాసనమండలికి ఇటీవల ఎన్నికైన సభ్యులు శనివారం మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి గవర్నర్ పలు సూచనలు చేసి ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. శాసన మండలికి వన్నె తేవాలని, సభలో అర్ధవంతమైన చర్చ కొనసాగించాలని వారికి గవర్నర్ సూచించారు.
ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా తలశిల రఘురాం వ్యవహరిస్తున్నారు. కాగా, వైసీపీ కార్యాలయ కోఆర్డినేటర్‌గా లేళ్ల అప్పిరెడ్డి పనిచేస్తున్నారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి వారు గవర్నర్‌కు విడమరిచి చెప్పారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..