మంగళవారం 27 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Oct 18, 2020 , 21:15:36

ఆభరణాల వ్యాపారి కుటుంబానికి తప్పిన ముప్పు

ఆభరణాల వ్యాపారి కుటుంబానికి తప్పిన ముప్పు

చిత్తూరు: ఆభరణాల వ్యాపారి కుటుంబానికి ముప్పు తప్పింది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన జ్యుయలరీ వ్యాపారి కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం హెలికాప్టర్‌లో  బయలుదేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో తిరుపత్తూరు-కుప్పం సరిహద్దులోని నంగిలి పొలాల్లో హెలికాప్టర్‌ అత్యవసరంగా దిగింది. కాగా అందులో ఉన్న ఇద్దరు పైలట్లతోసహా ఐదుగురికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరోవైపు స్థానికులు హెలికాప్టర్‌ను చూసేందుకు ఆసక్తి చూపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో ఆ హెలికాప్టర్‌ తిరుపతికి బయలుదేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo