T-SAT | జాతీయ స్థాయిలో మే నెల 5న నిర్వహించనున్న నీట్ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానెల్స్ స్పెషల్ లైవ్ లెసన్స్ ప్రసారం చేస్తాయని సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఇంటర్ పూర్తయ్యాక విద్యార్థులు డాక్టర్ కావాలనే ప్రత్యేక లక్ష్యంతో రాసే ‘నీట్’ పరీక్ష కోసం ఈ నెల 24 నుంచి అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో సబ్జెక్టుల వారీగా స్పెషల్ లైవ్ అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బాటనీ అండ్ జువాలజీ) సబ్జెక్టులకు సంబంధించి క్రాష్ట్ కోర్స్ రూపంలో 20 పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేయనున్నామని పేర్కొన్నారు. లైవ్ ప్రసారాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు కొనసాగనుండగా.. గురువారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు క్రాష్ కోర్స్ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయని సీఈవో తెలిపారు. నీట్ పరీక్ష రాసే విద్యార్థులు టీ-సాట్ కల్పించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్జెక్ట్, పరీక్షపై సందేహాలు తలెత్తితే 040-23556037, టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4039కు కాల్ చేయాలని సూచించారు.