MLC Shaik Sabji | రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జి (MLC Shaik Sabji) మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా.. ఎమ్మెల్సీ కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఎమ్మెల్సీ సాబ్జి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ గన్‌మెన్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. సాబ్జీ.. ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
Also Read..
Security Heightened | భద్రతా వలయంలో పార్లమెంట్ భవనం.. డేగ కళ్లతో పహారా కాస్తున్న సిబ్బంది
Bhajan Lal Sharma | రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం