e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నం.. వ్యక్తిని సజీవ దహనం చేసిన గ్రామస్తులు

వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నం.. వ్యక్తిని సజీవ దహనం చేసిన గ్రామస్తులు

వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నం.. వ్యక్తిని సజీవ దహనం చేసిన గ్రామస్తులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. వృద్ధురాలి వద్ద ఉన్న నగలను దోచుకొని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడో ప్రబుద్ధుడు. గుర్తించిన స్థానికులు అతడిని చావబాది పెట్రోల్‌ పోసి సజీవదహనం చేశారు. పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఓ వృద్ధురాలి వద్ద నగలను, నగదును లాక్కొని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చావబాదారు. అనంతరం పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. పలువురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నం.. వ్యక్తిని సజీవ దహనం చేసిన గ్రామస్తులు

ట్రెండింగ్‌

Advertisement