(Jawan Funeral) కర్నూలు : దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జవాన్ సుబ్బరామయ్య (36) అంత్యక్రియలు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లా అవుకు మండలంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులతోపాటు బంధుమిత్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
సుబ్బరామయ్య 2004లో మిలటరీలో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిక్కిం రాష్ట్రంలోని దేశ సరిహద్దుల్లో విధుల్లో ఉండగా ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడి సుబ్బరామయ్యపై పడ్డాయి. దాంతో సుబ్బరామయ్య తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచాడు. ఆయన మృతదేహన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..