(Jagananna Smart Township) అమరావతి: రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు (ఎంఐజీ) అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎంఐజీని ప్రారంభించారు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కోసం వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఇప్పటికే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నదే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ఇప్పటికే పేదలకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించామని తెలిపారు.
ఎంఐజీతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితులను బట్టి 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. మొదటి దశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్లు కేటాయిస్తారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లను మొదటి విడతగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లేఅవుట్లు సిద్ధం చేశారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను అన్ని అనుమతులు, సౌకర్యాలతో సిద్ధం చేశారు. ఏడాదికి రూ.18 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు కేటాయించనున్న ఇళ్లలో స్పష్టమైన పట్టాలు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పించనున్నది. అర్హులైన వారు ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, నిర్ణీత మొత్తాన్ని సంవత్సరంలో నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..