(YS Jagan) అమరావతి: ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వివిధ కారణాల వల్ల సంక్షేమ పథకాల కింద సొమ్ము అందని అర్హులైన లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం మరోసారి నగదు జమ చేసింది. 9.30 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.703 కోట్లు జమ చేసింది. ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు నగదు అందజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా నగదు జమ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎలాంటి రాజీ పడబోమని అన్నారు. కరోనా కాలంలో ప్రభుత్వ ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆగలేదని, కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందక పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో లెక్కకు మిక్కిలి అవినీతి జరిగిందని, అయితే తమ ప్రభుత్వం అలాంటి చర్యలకు దూరంగా ఉండి పేదలకు ఇంటింటికీ చేరేలా పథకాలను అమలు చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..