Yogi Vemana Versity: మెస్ బిల్లులు తగ్గించాలంటూ హాస్టల్ విద్యార్థుల ఆందోళన
Yogi Vemana Versity : రోజురోజుకు మెస్ బిల్లులు పెంచుతుండటంతో నానా ఇబ్బందులు పడుతున్నామని కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు...

(Yogi Vemana Versity) కడప : రోజురోజుకు మెస్ బిల్లులు పెంచుతుండటంతో నానా ఇబ్బందులు పడుతున్నామని కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు వాపోయారు. పెరిగిన మెస్ బిల్లులను వెంటనే తగ్గించాలని కోరుతూ వారు యూనివర్శిటీ ప్రాంగణంలోని హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాస్టల్పై ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేశారు. కాగా, విద్యార్థులు ఆందోళన చేపట్టి రోడ్డుపై బైఠాయించినప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. వారి సమస్యను ఆలకించే నాథుడు కరువయ్యారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెస్ బిల్లులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు రోడ్డెక్కారు. వర్శిటీ ప్రాంగణంలోని హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. నెలకు రూ.3 వేలు చెల్లించాలంటే చాలా ఇబ్బందికరంగా మారిందని విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. హాస్టల్ అభివృద్ధి కోసం నెలనెలా రూ.250 చెల్లిస్తున్నా.. ఎలాంటి అభివృద్ధి కానరావడం లేదని వారు వాపోయారు. ఇక్కడ చదువుకుంటున్న వారిలో ఎక్కువ మంది గ్రామాలకు చెందిన వారు ఉన్నారని, వేలల్లో బిల్లులు చెల్లించడం కన్నా చదువు మానేయడం ఉత్తమం అని భావిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని మెస్ బిల్లులు తగ్గించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

