(Wifi Signals at home) వారు చదువుతున్నది పదో తరగతే. అయినా, పరిశోధకులకు తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. తమను కొంచెం ప్రోత్సహిస్తే చాలు అద్భుతాలు చేస్తామంటున్నారు వీరు. ఇంట్లోనే వైఫై సిగ్నల్స్‌ను ఇలా సృష్టించుకొని వాడుకోండి అంటూ ప్రజలకు తమ పరిశోధన ద్వారా సూచిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రయోగంలో వాడే వస్తువులు ఏంటంటే.. ఓ అయస్కాంతం, రెండు బ్లేడ్లు, ఛార్జింగ్ వైర్.. ఈ మూడు వస్తువులతోనే ఇంట్లోనే వైఫై సిగ్నల్స్‌ను ఈజీగా అందుకోవచ్చునంటున్నారు ఈ విద్యార్థులు.
విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలోని జడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థులు గణేష్, వేణు, సాత్విక్.. తమ ఉపాధ్యాయుడు ఇటీవల విద్యుదయస్కాంత తరంగాల గురించి పాఠం చెప్పినప్పుడు ప్రేరణ పొందారు. స్పీకర్లలో ఉండే అయస్కాంతానికి బ్లేడ్లు, ఛార్జింగ్ వైర్‌ను ఉపయోగించి వైఫై సిగ్నల్స్ వచ్చేట్లుగా చేయగలిగారు. అయస్కాంతంపై ఉన్న రెండు బ్లేడ్లకు పెట్టిన ఛార్జింగ్ వైరును మొబైల్ ఫోన్‌కు జత చేయగానే వైఫై సిగ్నల్స్ కనెక్టవుతున్నాయని సాత్విక్ తెలిపాడు. వీరు చేసిన పరిశోధన పట్ల లక్ష్మీపురం జడ్పీ హైస్కూల్ ఫిజిక్స్ అధ్యాపకుడు రామకృష్ణ హర్షం వ్యక్తం చేసి వారిని అభినందించాడు. వీరిని సరైన రీతిలో ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని ఆయన చెప్పారు.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..