Nadendla Bhaskar Rao | మాజీ సీఎం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రావు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్ రావు 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుంచి 1989 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
1986 ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. నాదెండ్ల భాస్కర్ రావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం తెలియజేశారు. నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీ తరపున ఏపీ మంత్రిగా సేవలందిస్తున్నారని తెలిసిందే.
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!