Earthquake | ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం (Prakasam) జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది.
తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రామభద్రపురం, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు.
Also Read..
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 17వ ఘటన
Drugs | పటాన్చెరులో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
LPG tanker blast | ఎల్పీజీ ట్యాంకర్ పేలుడు ఘటనలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. 30 మంది పరిస్థితి విషమం