LPG tanker blast | జైపూర్ (Jaipur)లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్కును ఢీ కొట్టింది (LPG tanker blast). ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఉదయానికి మృతుల సంఖ్య 14కి చేరినట్లు డీసీపీ అమిత్ కుమార్ తెలిపారు.
శుక్రవారం ఉదయం జైపూర్-అజ్మీర్ రహదారిలో (Jaipur-Ajmer highway) ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్కును ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 37 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 80 మందికిపైగా గాయపడ్డారు. అందులో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
మరోవైపు చనిపోయినవారి కుటుంబాలకు రాజస్థాన్ సర్కారు రూ.5 లక్షలు, ప్రధాని తన జాతీయ సహాయ నిధి తరపున రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాయి. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష, ప్రధాని సహాయ నిధి రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని తెలిపాయి.
#UPDATE | Death toll in the fire incident on Bhankrota Ajmer Road in Jaipur reaches 14: DCP West Jaipur, Amit Kumar https://t.co/TIC8TDi6gA
— ANI (@ANI) December 21, 2024
Also Read..
PM Modi: 2 రోజుల కువైట్ పర్యటనకు ప్రధాని మోదీ
Harish Rao | శాసనసభను ఇలా ఆలస్యంగా నడపడం కరెక్ట్ కాదు.. స్పీకర్‌కు హరీశ్‌రావు సూచన
Telangana Assembly | ఏడో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం..