(Constable Death) విజయనగరం: కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన పోలీస్ కానిస్టేబుల్ శవమై తేలాడు. మెడికల్ లీవులో ఉన్న ఈ కానిస్టేబుల్ గత ఏడాది డిసెంబర్ 30న అదృశ్యమయ్యాడు. శనివారం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలోని తుప్పల్లో కానిస్టేబుల్ మృతదేహం లభించింది. సమీపంలోనే ఆయన వాడిన మోటార్ సైకిల్ దొరికింది. మృతుడికి భార్య సౌజన్య, ఇద్దరు పిల్లలతోపాటు తల్లిదండ్రులు ఉన్నారు. మరో 10 రోజుల్లో మెడికల్ లీవ్ ముగించుకుని విధుల్లో చేరే సమయంలో ఇలా చనిపోవడంతో తోటి ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని గరుగుబిల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
స్థానిక ఎస్ ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. 2009 బ్యాచ్ కు చెందిన డోకుల శ్రీనివాసులు విశాఖపట్నం ఎంవీపీ క్రైం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మెడికల్ లీవులో ఉన్న శ్రీనివాసులు గత నెల 30న స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివానివలసకు వచ్చాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం సమీపంలోని జోగిరాజుపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పెదమేరంగి జంక్షన్ నుంచి నందివానివలసలోని తన ఇంటికి వెళ్లకుండా అత్యవసర పని ఉందని తల్లితో చెప్పి రాత్రి 9.15 గంటలకు మోటార్ సైకిల్‌పై వెళ్లాడు. అనంతరం ఖడ్గవలస, ఉల్లిభద్ర జంక్షన్ వరకు వెళ్లి అదృశ్యమైనట్లు ఫోన్ సిగ్నల్స్ అందాయి.
డిసెంబర్ 31న కానిస్టేబుల్ తండ్రి గరుగుబిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో మూడు బృందాలు తీవ్ర గాలింపు చేపట్టగా.. ఎట్టకేలకు తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలోని తుప్పల్లో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా దవాఖానకు తరలించారు. శ్రీనివాసులు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, అనుమానాస్పద మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..