
(Constable cheating) విశాఖపట్నం: పెళ్లి చేసుకుంటానని బాసలు చేసి మోసం చేసిన కానిస్టేబుల్ ఉదంతం విశాఖలో వెలుగులోకి వచ్చింది. ఇతగాడిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం మహారాణిపేట వార్డు కార్యదర్శిగా ఉన్న 29 ఏళ్ల మహిళకు.. మహారాణిపేట పీఎస్ కానిస్టేబుల్ నిమ్మకాయల నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు మరింత ఎక్కువైంది. పెండ్లి చేసుకుంటానంటూ చాలా సార్లు సదరు యువతి వద్ద ప్రపోజ్ చేశాడు.
గత సంవత్సరం ఏప్రిల్ 23న ఆ యువతిని తానుంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోని గదికి తీసుకెళ్లి లొంగదీసుకున్నాడు. పలుమార్లు లైంగికదాడి చేయడంతో యువతి గర్భం దాల్చింది. విషయం తెల్సుకున్న నిందితుడు.. ఆమెకు మాత్రలిచ్చి గర్భాన్ని తొలగించాడు. పెండ్లి చేసుకోవాలని ఆ యువతి ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. దాంతో తనకు అన్యాయం చేస్తున్నట్లు భావించిన బాధితురాలు సోమవారం పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..